Latest Posts

సావిత్రిబాయి పూలే గారి195వ జయంతిని ఘనంగా జరుపుకున్న దళిత గిరిజనుల హక్కునుల సాధన సమితి మరియు ప్రజా సంఘాల నాయకులు

ఉరవకొండ 03.01.2025 న శనివారం రోజు
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ గోపాల్ గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రజా సంఘాల నాయకులతో కలిసి భారతీయ తొలి మహిళ ఉపాధ్యాయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం అయినది ఈ కార్యక్రమంలో నాయకులు మీనుగ గోపాల్, రమేష్, రంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్ర రాష్ట్రంలో సతారా జిల్లా నందు నంగావ్ గ్రామంలో 1831 వ సంవత్సరంలో జన్మించింది అప్పటి సంఘసంస్కర్త అయిన మహాత్మ జ్యోతిరావు పూలే గారిని పెళ్లి చేసుకుని ఆయన అడుగుజాడలలో నడిచిన గొప్ప మహనీయురాలు ఆమె భర్త జ్యోతిరావు పూలే గారి తో కలిసి 19వ శతాబ్దంలో మహిళ అభ్యున్నతికి పాటుపడి 1848న పూణే లో బాలికల పాఠశాలను ప్రారంభించారు.మహిళల అభివృద్ధిని కాంక్షించి బాల్యవివాహాలను అరికట్టి మహిళా సేవా మండల్ స్థాపించి, సత్యశోధక్ సమాజ్ నడిపిన గొప్ప మహనీయురాలు, సంఘ సంస్కర్త, కవయిత్రి మరియు స్త్రీవాద నాయకురాలు. అణగారిన వర్గాల విద్యా, హక్కుల కోసం పోరాడి, కులతత్వం, పితృస్వామ్య వ్యవస్థను ఎదిరించి, సామాజిక విఫలవానికి మార్గదర్శకులయ్యారు, ఆమె జీవితం బావి తరాలకు ఆదర్శం అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రమేష్ రాష్ట్ర చర్మకార సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు రంగారెడ్డి ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, బి. వెంకటేష్ నియోజకవర్గ కార్యదర్శి, సోనియా సీన కాంగ్రెస్ డిసిసి కార్యదర్శి సుధాకర్ టౌన్ ప్రెసిడెంట్, రహంతుల్లా రాయలసీమ ముస్లిం మైనార్టీ వ్యవస్థాపకులు,రఫిక్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్, చంద్రాయుడు సిపిఐ జిల్లా సెక్రెటరీ , సుల్తాన్ సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి, చంద్రమౌళి నాయక్ బంజారా నాయకులు, రాము శ్రీ కరి బసవ వికలాంగుల మండల సమైక్య నియోజకవర్గ అధ్యక్షులు, ఫక్రుద్దీన్ సెక్రెటరీ, మీనుగ గంగాధర్ ఎమ్మార్పీఎస్ గౌరవ జిల్లా అధ్యక్షులు, కే. ఓబులేసు కురుబ సంఘం మండల కార్యదర్శి, కౌకుంట్ల ధనుంజయ, లత్తవరం పోలేరు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Posted Under AP
Editor