శ్రీ సత్యసాయి జిల్లా6
జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ గారు మరియు ఆర్డీవో మహేష్ వారు ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షించి తదుపరి రీసర్వే పూర్తైన మార్తాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్‌ను పంపిణీ చేశారు.
భూ రికార్డుల నవీకరణ, రీసర్వే అమలు, మ్యుటేషన్, వారసత్వ దరఖాస్తులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులు సమీక్షించి, రైతులకు సేవలు వేగవంతంగా మరియు పారదర్శకంగా అందించాలని సూచించారు.
ఈటివల కలెక్టర్ వారి కార్యాలయంలో నిర్వహించిన (29-12-2025) రెవిన్యూ క్లినిక్ కార్యక్రమం లో భాగంగా స్వీకరించిన ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు .వాటిని వెంటేనే పరిష్కరించాలని ఆదేశించారు.
సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూ సరిహద్దులు, విస్తీర్ణాలపై స్పష్టత వచ్చి రైతులకు ఖచ్చితమైన భూ రికార్డులు అందుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ స్వామి, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
