Latest Posts

నిబంధనలు లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి: ఆర్డీవోకు సీపీఐ డిమాండ్

  • రెవెన్యూ వారి
    సిఫార్సు లేకుండా పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చెయ్యాలి,
  • ధర్మవరం ఆర్డీవో
    మహేష్ కు విన్నవించిన అనంతరం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు

1954 ముందు అసైన్డ్ చేయబడిన ప్రైవేటు భూములు రెవెన్యూ వారి సిఫార్సు లేకుండా 2018 ముందు
ఏ విధంగా రిజిస్టర్ అయ్యాయో అదే పద్ధతిలోనే ఆ భూములు క్రయవిక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు శుక్రవారం ముదిగుబ్బకు వచ్చిన ధర్మవరం ఆర్డిఓ మహేష్ కు విన్నవించారు, ఈ మేరకు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆర్డీవోతో మాట్లాడుతూ 1954 ముందు ఉన్న ప్రైవేటు భూములను నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని గురువారం రెవెన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం ఓవైపు హర్షించదగ్గ విషయమైనా మరోవైపు అదే భూములను గతంలో మాదిరి కాకుండా ఈసారి రెవెన్యూ వారికి దరఖాస్తు సమర్పించి వారు పరిశీలించిన తర్వాత వారి అనుమతితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధనలు పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు, దీంతో ఆర్డీవో మాట్లాడుతూ ఆయా భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి త్వరలోనే గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులతో దరఖాస్తుల స్వీకరించి తద్వారా వాటిని పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తామని చెబుతూ సరైన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడంతో సిపిఐ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, తదనంతరం సిపిఐ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2018 లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్ కాకుండా చేయడమే గాక తిరిగి పాత సీసాలో కొత్తనీరుగా అదే భూములను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ అనుమతిస్తామని ఇది రైతులకు నూతన సంవత్సరం గుడ్ న్యూస్ అని రెవెన్యూ శాఖ మంత్రి గురువారం చెబుతూనే మరోవైపు
ఆ భూమలను గతంలో మాదిరి కాకుండా రెవెన్యూ వారు అనుమతి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే లేనిపోని షరతులు విధించడం దారుణమని సిపిఐ నాయకులు శ్రీనివాసులు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు, ఇప్పటికే 2018 నుంచి తమ భూములు రిజిస్ట్రేషన్ గాక గత ఏడేళ్లుగా తమ భూములను ఆర్థిక ఇబ్బందుల నడుమ అమ్ముకోలేక కనీసం ఆయకం పెట్టి డబ్బులు తీసుకునే అవకాశం కూడా లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితా లో ఉన్న ప్రైవేటు భూములను పూర్తిగా తొలగించి నుంచి.రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తామని చెబుతూనే మరోవైపు రెవెన్యూ వారు అనుమతించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేనిపోని షరతులు విధించడం బాధాకరమన్నారు, కనుక నిషేధిత జాబితా నుంచి తొలగించిన ప్రైవేటు భూములను ఎటువంటి షరతులు లేకుండా గతంలో మాదిరి రైతులు స్వేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు.ప్రభుత్వానికి తెలియజేశారు, అదేవిధంగా ఫ్రీ ఓల్డ్ భూముల వ్యవహారంపై కూడా తక్షణమే స్పష్టత ఇవ్వాలని కోరారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్యతో పాటు స్థానిక నాయకులు కుర్ర నాయుడు, సోంపల్లి భాస్కర్, లింగుట్ల వెంకట్ రాముడు, కూచి ప్రభాకర్ నాయుడు,వై రమేష్ నాయుడు, కె ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor