ముదిగుబ్బ జనవరి 1:(YES 9 TV):
ముదిగుబ్బ మండలం లోని ప్రజాశక్తి క్యాలెండర్ 2026 ను గురువారం రూరల్ సీఐ కార్యాలయం నందు సీఐ ఏ.సునీత ఆవిష్కరణ చేసారు…ఆమె మాట్లాడుతూ ప్రజాశక్తి దిన పత్రిక అనేది మంచి విలువలను పాటిస్తూ ప్రజా సమస్యలను సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తెస్తుంది…ప్రజాశక్తి దిన పత్రిక కు తెలుగు పత్రికా రంగంలో ఒక ప్రత్యేక మైన గుర్తింపు ఉందని చెప్పారు… ఈ కార్యక్రమం లో సీఐ కార్యాలయం లో సిబ్బంది, సిపిఎం,సీఐటీయూ, అవాజ్ నాయకులు, ట్రాలీ యూనియన్ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు…
ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ప్రజాశక్తి’ పాత్ర ప్రశంసనీయం: సీఐ ఏ.సునీత
