ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి
-ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. నియోజకవర్గంలో గురువారం క్రిస్మస్ పండుగ నిర్వహించుకున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పురస్కరించుకొని నగరంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా చిత్తూరు చర్చి వీధిలోని ప్రధాన చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు రూ.50.50కోట్ల గౌరవ వేతన బకాయిలను విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
