Latest Posts

ఐక్యూ (IQ) పెంచుకొని లక్ష్యాన్ని సాధించండి: జేఎన్టీయూ విద్యార్థులకు డాక్టర్ భాస్కర్ నాయుడు దిశానిర్దేశం!

విద్యార్థులు తమ కాలాన్ని శక్తిని దుర్వినియోగపరచరాదు.. అనవసర విషయాలను ఆపండి ఐ క్యును పెంచుకోండి. జె ఎన్ టి యు విద్యార్థులతో రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు. అనంతపురం జిల్లా. జేఎన్టీయూ విశ్వ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఇంచార్జ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐక్యును పెంచుకొని విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తే తన అనుకున్న లక్ష్యం కంటే పది రెట్లు గొప్పగా ముందుకు పోగలరని తెలియజేశారు. గాలి నీరు అన్నం పరబ్రహ్మ స్వరూపమని వాటి ద్వారా వచ్చిన శక్తులను దుర్వినియోగ పరచరాదని అనవసరమైన ఆలోచనలు కాలయాపన చేయరాదని మీ లక్ష్యాన్ని చేరుకొనుటకు మాత్రమే ఆ శక్తిని వాడుకోవాలని సమస్త జీవరాశులకు ఆధారంగా ప్రకృతిని నియమించి దేవతలందరూ సేవకులుగా పనిచేస్తున్నారు అలాంటివారు ప్రసాదించిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కూలంకుశంగా తెలియజేశారు. మనుషులందరి కోసం అన్నదాత పంటలు పండిస్తే సమస్త జీవరాశుల కోసం దేవతలు ప్రకృతిని నియమించారని దాని ద్వారానే సంస్థ జీవరాసులు జీవిస్తున్నాయని తెలియజేస్తూ మనిషి తప్ప సమస్త జీవరాసులు ప్రకృతిలోనే ఉంటాయని గుర్తించి చెట్లు అడవులను కాపాడాలని గుర్తు చేశారు. దేవతల చేత నిర్వహించబడుతున్న ప్రకృతిని మనుషులు నాశనం చేయరాదని అలా చేస్తే అడ్డుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రాణయామం, ధ్యానం, ఆసనాల ద్వారా నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని మేధస్సును వృద్ధి చేసుకొని ఐ క్యు పెంచుకొని ఉత్తమ విద్యార్థులుగా మారి దేశ సేవ చేయాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఫిలిం డైరెక్టర్ రషీద్, యూనివర్సిటీ సిబ్బంది సత్యసాయి జిల్లా షాప్ కోచ్ ప్రతాప్ పాల్గొన్నారు.

Posted Under AP
Editor