Latest Posts

పెనుమూరులో కరెంటోళ్ల జనాబాట….

 

ఏపీఎస్పిడిసిఎల్ నూతనం గా ప్రవేశపెట్టిన కరెంటోళ్ల జనాభాటా కార్యక్రమం మంగళవారం పెనుమూరు మండలం లో ప్రారంభం అయింది. మండలం లోని సామిరెడ్డిపల్లి పంచాయతి ప్రతి గ్రామం లోని విద్యుత్ సమస్యల మీద గ్రామస్తులతో జీడీ నెల్లూరు ఏ డి ఈ శేషాద్రి రెడ్డి, పెనుమూరు ఏ ఈ తులసీ ప్రసాద్ మాట్లాడారు. మండలం లోని సిబ్బందితో పంచాయతీ పరిధిలోని ప్రతి పోలు, ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్లు పరిశీలించి సమస్య లు గుర్తించారు. స్థానికం గా పరిష్కారం ఐయ్యే వాటిని పరిష్కారం చేస్తున్నామని, వీలు కాని వాటిని ఉన్నతధికారులకు ప్రతిపాదనలు నివేదిస్తున్నట్లు ఏ ఈ తులసీ ప్రసాద్ తెలిపారు.

Posted Under AP
Editor