Latest Posts

ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం: వైఎస్ జగన్ జన్మదినోత్సవ సందర్భంగా కానుక!

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ ఐరాల మురళి కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక సర్పంచ్ ఐరాల మురళి కుమార్ రెడ్డి, కనక రాజులు, గుణశేఖర్ రెడ్డి రూ. 2 లక్షలు సొంత నిధులతో ఉగ్రాణంపల్లె హై స్కూల్ వద్ద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రజలకు మినరల్ వాటర్ అందుబాటులోకి తీసుకురావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధనంజయ రెడ్డి, ధీరజ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రమణారెడ్డి, గోవింద్ రెడ్డి, సాయి వినయ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సాయి, చక్రి, ప్రవీణ్ పాల్గొన్నారు.

Posted Under AP
Editor