చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మామిడి రైతుల ధర్నాకు సంబంధించి ఎటువంటి అనుమతి లేదని చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ శ్రీ టి. సాయినాథ్ సోమవారం స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల ధర్నాకు కొంత మంది పిలుపు నిచ్చినట్లు సమాచారం అందిందని, అయితే ఈ ధర్నాకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేకుండా నిర్వహించే ధర్నాల్లో ఎవరైనా పాల్గొంటే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని డీఎస్పీ హెచ్చరించారు.
ఏదైనా సమస్య పైన రైతు సంఘ నాయకులు మరియు రైతులకు అర్జీ సమర్పించుటకు మాత్రమే అనుమతి కలదన్నారు. అమాయకపు రైతులు ఎవరి మాటలు నమ్మి ఈ ధర్నాలో పాల్గొనవద్దని, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీ టి. సాయినాథ్ గారు రైతులను విజ్ఞప్తి చేశారు
