Latest Posts

పల్స్ పోలియోలో ఎమ్మెల్యే, కలెక్టరు….

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టరు సుమిత్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్వో డా.లోకేష్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వైద్య శాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor