Latest Posts

తిరుచానూరు అమ్మవారి సేవలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మరియు డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ప్రముఖులు…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , భారత ప్రభుత్వ వ్యూహాత్మక మెటీరియల్ పాలసీ సెక్రటరీ & డిఆర్డిఓ (బ్రహ్మోస్) డైరెక్టర్ జనరల్ జైతీర్థ్ ఆర్ జోషి కుటుంబ సమేతంగా వేరువేరుగా ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారికి రుత్వికులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు సూపరిండెంట్లు సురేష్ బాబు, ముని చెంగల్ రాయలు సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor