Latest Posts

తల్లి మరణాన్ని తట్టుకోలేక: మూడు రోజులుగా శ్మశానంలో నిద్రిస్తున్న యువతి

తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఆఫ్రిన్ అనే యువతి, తన తల్లి మరణాన్ని తట్టుకోలేక ఎవరూ ఊహించని పని చేసింది. తల్లి సమాధి వద్దే గత మూడు రోజులుగా నిద్రిస్తోంది. కరీంనగర్‌లోని అజ్మత్‌పూర్ ప్రాంతంలో నివసించే ఆమె తల్లి హసీనా ఇటీవల అనారోగ్యంతో మరణించారు.

తల్లి మరణించినప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆఫ్రిన్, అంత్యక్రియల తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా సవరన్ షీట్ కబరస్థాన్‌లోని తల్లి సమాధి వద్దే ఉండిపోయింది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు బలవంతంగా ఇంటికి తీసుకెళ్లినా, ఆమె మళ్లీ పరుగెత్తుకుంటూ సమాధి వద్దకే వచ్చి రాత్రివేళల్లో కూడా అక్కడే గడుపుతోంది.

ఆఫ్రిన్ వింత ప్రవర్తన, రాత్రిపూట శ్మశానంలో గడపడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి, ఆమె తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యులు వచ్చి ఆఫ్రిన్‌ను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లినట్లు, ప్రస్తుతం ఆమెను ఇంట్లోనే ఉంచుతున్నట్లు సమాచారం.

Editor