భారత్-అమెరికా మధ్య త్వరలోనే తొలి దశ ట్రేడ్ డీల్!

భారత్, అమెరికా మధ్య గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన వాణిజ్య చర్చలు ప్రస్తుతం మళ్లీ వేగం అందుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను త్వరలోనే ఖరారు చేసే దిశగా ఇరు దేశాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సానుకూల పరిణామం రెండు దేశాల వ్యాపార రంగానికి గొప్ప ఊరటనిస్తోంది. ముఖ్యంగా, అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం దిశగా చర్చలు సాగుతుండటం ఇందులో కీలక అంశంగా మారింది.

ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, బైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలలో రెండు భాగాలు ఉన్నాయి. వీటిలో ఒక భాగం పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. అయితే, రెండో భాగం రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీకి సంబంధించింది. ఈ రెండవ విషయంలో ఇరు దేశాలు డీల్‌కు దగ్గరగా ఉన్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ తొలి దశ ఒప్పందం ఖరారైతే, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.

Editor