వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. తాను అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు అందుకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. ఈ పిటిషన్‌పై సిట్ (SIT) తరుపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో, ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మిధున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉండటం మరియు బెయిల్ పై ఉండటం కారణంగా, ఆయన విదేశీ పర్యటనకు న్యాయస్థానం అనుమతి తప్పనిసరైంది.
మిధున్ రెడ్డి ఈ నెల 20వ తేదీ నుంచి న్యూయార్క్ నగరంలో పర్యటించనున్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ కు హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ పిటీషన్ వేశారు. కోర్టు అనుమతితో, ఆయనకు పాస్‌పోర్టును తిరిగి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
మిధున్ రెడ్డి ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ న్యూయార్క్ లో పర్యటించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై ఉన్నప్పటికీ, పార్లమెంటు సభ్యుడిగా అంతర్జాతీయ వేదికపై హాజరు కావడం కోసం కోర్టు అనుమతి ఇవ్వడం ఈ కేసు పరిణామాల్లో ఒక ముఖ్యమైన మలుపుగా భావించవచ్చు.
