బిహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఈసీ ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. ఈ మేరకు బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం తాజాగా తెలిపింది. ఈ ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని తేలిందని పేర్కొంది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్లు తెలిపింది.
బిహార్ రాష్ట్రం ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం తాజాగా తెలిపింది. బిహార్లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు మరణించారు. 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు ఈసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్లు తెలిపింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న ప్రచురించనుంది.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు ప్రజలు అభ్యంతరాలు తెలుపవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు నిర్ణీత గడువులోగా అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొంది. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురిస్తామని ఈసీ స్పష్టం చేసింది. బిహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోహింగ్యాలు, స్థానికేతరులు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటాన్ని గుర్తించారు. అయితే, ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.
