అసలే ఎండాకాలం.. రాత్రివేళ కాస్త మందు పుచ్చుకోకుంటే మందుబాబులకు నిద్ర రాదు. అలాంటిది మూడురోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఇంతకీ కారణమేంటో తెలుసా? హైదరాబాద్ సిటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రూల్స్‌ని అతిక్రమిస్తే చర్చలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 21 (సోమవారం) సాయంత్రం 4 గంటల నుండి మొదలు ఏప్రిల్ 23 (బుధవారం) సాయంత్రం 6 గంటల వరకు మద్యం, వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆ తర్వాత షాపులు ఓపెన్ కానున్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే మద్యం బాబులకు ఊహించని షాక్. కౌంటింగ్ జరిగే ఈనెల 25న మద్యం దుకాణాలు క్లోజ్ చేయాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఎండాకాలంలో పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. గడిచిన పదేళ్లలో ఈ తరహా ఎన్నికలు లేవని అంటున్నారు.
దాదాపు 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీపై రాజకీయ పార్టీలు పట్టు సాధించడమే. బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఎంఐఎం విజయంపై ధీమాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తమ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్‌ని గెలిపించుకోవాలని చూస్తోంది. కచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పకనే చెబుతోంది.
ఇప్పటివరకు బలంగా ఉన్న విపక్ష బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నిర్ణయం బీజేపీకి కలిసి వస్తుందని అంటున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండడంతో బీజేపీ ఆయా సీట్లను గెలుచుకుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
