విద్య మరియు ఐ.టి. శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని తాడేపల్లి లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు కలిశారు.
నియోజకవర్గ విషయాల పై మాట్లాడారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని విద్యాభివృద్ధి గురించి చర్చించారు. మంత్రి లోకేష్ గారి సలహా సూచనలు తీసుకున్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు గురించి కూడా మంత్రి లోకేష్ గారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి సూచించారు. అలాగే నియోజకవర్గ టిడిపి కుటుంబ సభ్యులు, కార్యకర్తల సంక్షేమం పై శ్రద్ధ ఉంచాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి సూచించారు.
