Latest Posts

అరటి ఎగుమతుల కోసం జిల్లాలో యూరోప్ దేశానికి చెందిన కంపెనీ ప్రతినిధి పర్యటన..

అనంతపురం, మార్చి 02 :

 

అనంతపురం జిల్లా నుంచి అరటి ఎగుమతులు చేసేందుకోసం యూరోప్ దేశానికి చెందిన కంపెనీ ప్రతినిధి జిల్లాలో ఆదివారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో యూరోప్ దేశానికి చెందిన faitrasa company ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాట్రిక్ పర్యటించారు. ముందుగా రాప్తాడు మండలం రామినేపల్లిలోగల ఎలైట్ బయోటెక్ టిష్యూ కల్చర్ ల్యాబ్ సందర్శించి అందులో ఉత్పత్తి అవుతున్న టిష్యూ కల్చర్ అరటి మొక్కల వివరాలను లాబ్ ఎండి రాఘవేంద్ర నుంచి వివరాలు తెలుసుకున్నారు.

తరువాత పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి విచ్చేసి SK బనానా company వారు అరటి తోటల నుంచి గెలలు ఎలా సేకరిస్తున్నారు, వాటిని ఎలా 13 కేజీలు మరియు ఏడు కేజీల బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తున్నారు అనే విధివిధానాలను క్లీనింగ్ అండ్ ప్యాకింగ్ పద్ధతులను పరిశీలించారు. అలాగే ఫ్రూట్ కేర్ యాక్టివిటీలో భాగంగా అరటి గెలలను అధిక సూర్యరశ్మి నుంచి దుమ్ము మరియు పురుగులు తాకిడి నుంచి అరికట్టడానికి రైతులు పాటిస్తున్న గెలలకు కవర్లను వినియోగాన్ని రైతుల నుంచి ఆయన అడిగి తెలుసుకున్నారు. తదుపరి తాడిపత్రి మండలంలోని చుక్కలూరు గ్రామంలో ఉన్న సిద్ధార్థ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ని సందర్శించి అక్కడ ఉన్న కోల్డ్ గదులను సందర్శించి సంతృప్తిని వ్యక్తం పరిచారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సిద్ధార్థ కోల్డ్ స్టోరేజ్ కు వచ్చి యూరోప్ దేశానికి చెందిన పాట్రిక్ ని కలిసి తాడిపత్రి మరియు అనంతపురం రైతుల నుంచి అరటి, దానిమ్మ మొదలగు పండ్ల ఉత్పత్తులను సేకరించి యూరోప్ దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఇరాన్, ఇరాక్, దుబాయ్ లాంటి అరేబియా దేశాలకు జిల్లా ఉత్పత్తులను పంపించడం జరుగుతోందని, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, రష్యా లాంటి దేశాలకు కూడా జిల్లా ఉత్పత్తులని పంపించేందుకు కోసం యూరప్ ప్రతినిధిని జిల్లాకు పిలిపించి క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జాయింట్ డైరెక్టర్ హార్టికల్చర్ దేవమునిరెడ్డి, రాప్తాడు ఉద్యాన అధికారి రత్నకుమార్, పుట్లూరు ఉద్యాన అధికారి శైలజ, తాడిపత్రి ఉద్యాన అధికారి ఉమాదేవి, గ్రామ ఉద్యాన సహాయకులు, ఎస్కే కంపెనీ ప్రతినిధి నరసింహారెడ్డి, గ్రీన్ ట్రాఫిక్ ప్రతినిధి రామోజీ, నోవా కంపెనీ ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

———————————————

DIPRO.I&PR.ATP..

Posted Under AP
Editor