నేడు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది. గత విచారణ సందర్భంగా అనర్హత నిర్ణయం తీసుకోడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Editor