ప్లాష్….ప్లాష్.. న్యూస్ ధర్మవరంలో
ధర్మవరం కేతిరెడ్డి కాలనీ ఎల్ 4 లో లక్ష్మి, శ్రీనివాసుల దంపతులకు చెందిన ఇంటిపై సుమారు 50 మందికి పైగా వచ్చి ఇంటిపైకి వచ్చి ఇంటిలోని టీవీ, ప్రిడ్జ్ బీరువా, గ్యాస్ సిలెండర్, ఇంటిలోని సామాన్లు బయటకు విసిరి వేసి ఇంటి పైకి ఎక్కి పెద్ద రాళ్ళతో పైకప్పు ను పగులకొట్టి నానా భీభత్సం సృష్టించారు.

బాధితుడు శ్రీనివాసులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో రెండు సంవత్సరాలకు పైగా ఇంటిని నిర్మించుకొని కాపురం వుంటున్నామని, అయితే కేతిరెడ్డి కాలనీకి చెందిన వీరన్న అనేవ్యక్తి వచ్చి ఈ స్థలం నాది అంటూ కొద్ది రోజులుగా ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నాడని తెలిపాడు. అయితే దీనిపై తాము కోర్టును సైతం ఆశ్రయించామని, అయినా కూడా ఈరోజు 50 మందితో వచ్చి ఇంటిపై దాడి చేసి ఇంటిని పగుల గొట్టాడని ఆవేదన చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేసామని తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
