మందు బాబులకు షాక్ – మద్యం ధరల పెంపు..! ఎంతంటే..?

మందు బాబులకు షాక్ తగలనుంది. మద్యం ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు జరుగుతోంది. మద్యం ధరలు పెంచాలని కొంత కాలంగా బ్రూవరీలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాయి. దాదాపుగా 15 శాతం వరకు ధరలు పెరగటం ఖాయమని సమాచారం. దీంతో బీర్ల ధరలు సైతం పెరగనున్నాయి. ఈ మేరకు వినియోగ దారుల పైన భారం పడేలా ప్రభుత్వం అధికారిక నిర్ణయానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం.

 

అమ్మకాలు ఆదాయం

రాష్ట్రంలో 2 వేల 260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30 వరకు 2 వేల 838 కోట్ల అమ్మకాలు జరగ్గా… అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,100 కోట్ల మేర విలువైన బీర్ల ఉత్పత్తి కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10-15శాతం మేర పెంచాలని.. తద్వారా మద్యం ధరలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి జరుగుతోంది. 12 బీర్లు ఉండే ఒక కేసుకు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లైట్‌ బీర్లకు రూ.289, స్ట్రాంగ్‌ బీర్లకు రూ.313 చెల్లిస్తున్నది.

 

l

తాజా ప్రతిపాదనలు

మద్యం దుకాణాలు ఒక్కో కేసు రూ.1,800 చొప్పున అమ్ముకుంటున్నాయి. తయారీ కేంద్రాల వద్ద సుమారు రూ.24కి లభించే ఒక బీరు.. వినియోగదారులకు వచ్చేసరికి రూ.150 అవుతుంది. అయితే, బ్రూవరీల నుంచి వచ్చిన ప్రతిపాదనల పైన అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. అయితే, గతంలోనూ ఇదే రకమైన ప్రచారం జరగ్గా, నాడు ప్రభుత్వం ఖండించింది. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెరిగేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది

Editor