Latest Posts

మాలలారా మేలుకోండి, హక్కులను కాపాడుకోండి..

మాలలారా మేలుకోండి, హక్కులను కాపాడుకోండి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నంలో భాగంగా ఎస్సీలను విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారని గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం జరిగింది మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు

దోసల చంద్రం మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉండాలి హక్కులను కాపాడుకోవాలని నినాదంతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్యాధికారం కోసం కొట్లాడాలి తప్ప దళితులు అన్నదమ్ముల విడిపోతే అగ్రవర్ణాలు అధికారంలో రానీయకుండా చేస్తారని తెలిపారు. రిజర్వేషన్ల పెంపు కోసం పోరాడాలి తప్ప పంపకాలు చేసుకొని విడిపోతే నష్టమే తప్ప లాభం లేదని, భవిష్యత్తులో రిజర్వేషన్లనే లేకుండా చేసేందుకు మొదట ప్రయత్నంలో భాగంగా వర్గీకరణ చేస్తున్నారని కళ్ళు తెరిచి మనసుపెట్టి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు పోట్లాడాల్సిన సమయం అని అన్నారు. న్యాయమైన రిజర్వేషన్ల కోసం మాల లంతా ఏకమై ఐక్యమత్యంతో సత్తా చాటాల్సిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించాల్సిన సమయం ఆసన్నమైందని క్షేత్రస్థాయి నుండి ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఏకమవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జిల్లా నాయకులు మల్యాల రాజ్వీర్ నాయకులు దోసల శంకర్ తోడేటి సుదర్శన్ దోసల రవి బరిగెల జీవన్ టేకు మల్ల చిన్న తుమ్మల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Editor