బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి- : జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జులై 29 :

ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్లాంటేషన్ వర్క్, ఇప్పటికే అనుమతులు పొందిన పనులను పూర్తి చేయాలని, అనుమతులు లేని పనులకు త్వరితగతిన అనుమతులు పొంది లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. కూడేరు మండలం లేబర్ వర్క్ చాలా తక్కువగా ఉందని వారం రోజుల్లో పనులు పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరి, ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఎంలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

DIPRO.I&PR.ATP..

Editor