Latest Posts

మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పిన్నెల్లి..

ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్, పోలింగ్ తర్వాత జరిగిన ఘటనల్లో పిన్నెల్లిపై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక దానికి సంబంధించి ఇప్పటికే ఆయన కాస్త ఊరట లభించింది. కానీ మిగతా కేసుల్లోనూ అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారాయన. నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాదు అత్యవసరంగా విచారించాలని కోర్టుకు విన్నవించారు.

 

కాగా.. ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే కోర్టు విధించిన షరతులను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉల్లంఘించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోయారని, మరో మూడు కేసుల్లో బెయిల్ పొందేందుకు ఆయన అనర్హుడని పీపీ స్పష్టం చేశారు. వాదనలకు సమయం లేకపోవడంతో.. విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Posted Under AP
Editor