ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో పయనమై కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో పులివెందుల వెళ్తారు. సీఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 11.25-11.40 గంటల మధ్య సమయంలో నామినేషన్ వేస్తారు. అనంతరం భాకరాపురంలోని ఇంటికి వెళ్లి..రెస్ట్ తీసుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా కడపకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరంకు వెళ్తారు.
మరోవైపు వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి భద్రత పెంచారు. గురువారం జై భారత్ పార్టీ నుంచి నామినేషన్ వేయనున్న దస్తగిరికి పోలీస్ శాఖ భద్రత పెంచింది. ఇప్పటి వరకూ 3+3, 4+4 గా ఉన్న భద్రతను రెండ్రోజులు 10+10గా పెంచింది. వైసీపీ నేతలు తన నామినేషన్ ను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని, జగన్ నామినేషన్ సమయంలోనే తానూ నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
మరోవైపు ఏపీలో నామినేషన్ల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన జరగుతుంది. గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 203 మంది ఎంపీ అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 1123 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1344 సెట్ల నామినేషన్లు వేశారు.
