ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి కేసును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో కాలంగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో సిబీఐ కూడా కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసి విచారణ జరిపి, ఈ స్కామ్ లో కవిత కీలక భూమిక పోషించిందని, భారీ అవినీతికి పాల్పడిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించింది.
సీబీఐ కేసులో కవిత బెయిల్ పై ముగిసిన వాదనలు ఈ క్రమంలో సిబిఐ అరెస్టు పైన కూడా కవిత బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. నేడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సిబిఐ కేసులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే రెండవ తేదీన తీర్పును వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది.
వాడీ వేడిగా వాదనలు ఇటు కవిత తరఫున, అటు సిబిఐ తరఫున లాయర్లు కవిత బెయిల్ పిటిషన్ పై వాడివేడిగా వాదనలు జరిపారు. ఒక మహిళగా కవిత పి ఎమ్ ఎల్ ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హురాలని, కవిత నేరస్తురాలు అని చూపించే ఒక్క సాక్ష్యం కూడా సిబిఐ వద్ద లేదని, ఈడి కస్టడీలో ఉన్న సమయంలోనే సిబీఐ ఎందుకు అరెస్టు చేసిందని కవిత తరపున న్యాయవాదులు ప్రశ్నించారు.
బలంగా వాదన వినిపించిన సీబీఐ కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేనప్పటికీ కావాలని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో జరిగిన చిదంబరం కేసులోని తీర్పు కవిత విషయంలో కూడా సరిపోతుందని కవిత తరపున న్యాయవాది ప్రస్తావించగా, సిబిఐ కూడా కవిత విషయంలో బలంగా వాదనలు వినిపించింది. కవితకు బెయిల్ ఇస్తే కేసులో సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని వాదించింది.
కవితనే కింగ్ పిన్ అంటూ సీబీఐ వాదన సాక్షాలను ధ్వంసం చేసే అవకాశాలు కూడా లేకపోలేదని సిబీఐ తెలిపింది. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని మరోమారు చెప్పిన సీబీఐ బెయిల్ ఇవ్వద్దని గట్టిగానే వాదించింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్ పై తీర్పును మే రెండవ తేదీన వెల్లడిస్తామని రిజర్వ్ చేసింది.
ఈడీ కేసు బెయిల్ పిటీషన్ పై కవిత తరపు వాదన ఇక మరోవైపు ఈ డి కేసులో బెయిల్ పిటిషన్ పైన కూడా నేడు కోర్టులో వాదనలు జరిగాయి. కవిత తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బలంగా వాదనలు వినిపించారు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, కనీసం అనుమానితురాలిగా కూడా కవిత లేదని కోర్టుకు తెలిపారు.
రేపు మళ్ళీ ఈడీ కేసులో విచారణ టెర్రరిస్టులు, కరడుగట్టిన నేరస్తులను ట్రీట్ చేసినట్టు ఈడీ అధికారులు కవితను ట్రీట్ చేశారని, కవితను అక్రమంగా అరెస్టు చేశారని, కవితకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈడి కేసులో బెయిల్ పిటిషన్ పై కోర్టు నేడు వాయిదా పడగా రేపు విచారణ కొనసాగనుంది.
