ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుంటే..ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పొత్తుల కోసం పాకులాడుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తును ప్రకటించారు.
ఇరు పార్టీల అధినేతలు సీట్ల పంపకం గురించి పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జనసేన 40 నుంచి 50 సీట్లను డిమాండ్ చేస్తుండగా..25 సీట్ల లోపు ఇవ్వడానికి చంద్రబాబు సముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సరిగ్గా సమయంలోనే నారా లోకేష్ సీఎం పదవి గురించి చేసిన కామెంట్స్ టీడీపీ – జనసేన పొత్తులో విభేదాలు తలెత్తేలా చేశాయి. పవన్ కల్యాణ్‌కు సీఎం పదవి షేరింగ్ ఉండదని.. అనుభవం కలిగిన చంద్రబాబే ఐదేళ్లు సీఎంగా ఉంటారని ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో నారా లోకేష్ స్పష్టం చేశారు.
పైగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కడం కష్టమనే అర్థం వచ్చేలా నారా లోకేష్ మాట్లాడారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు అంటూనే మిత్ర బంధాన్ని తుంగలో తొక్కారని టీడీపీపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేది లేదని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అటు కాపు సామాజిక వర్గం సైతం పవన్ కల్యాణ్‌పై ఎదురుతిరుగుతున్నారు. ఇదే సమయంలో కాపులంతా పవన్‌ను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారనే అభిప్రాయం కాపుల్లో నెలకొంది. క్షేత్రస్థాయిలో పవన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది.దీన్ని గ్రహించిన చంద్రబాబు కొత్త పొత్తులకు తెర లేపారని తెలుస్తుంది. పవన్‌ను నమ్ముకుని ముందుకు వెళ్తే కష్టమనే భావనకు చంద్రబాబు వచ్చారట.
జనసేన నుంచి ఓట్లు అనకున్నంత స్థాయిలో టీడీపీకి బదిలీ కావాని ఫిక్స్ అయిన చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకణాలకు తెరలేపినట్టే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్‌తో జతకట్టడానికి కూడా చంద్రబాబు వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సైతం సిద్దం పడినట్టు సమాచారం. చంద్రబాబును బీజేపీ నమ్మే పరిస్థితి లేకపోవడంతో..ఆయనకు దారులన్ని మూసుకుపోతున్నాయి.
దీంతో చేసేది లేక ఆయన కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుగుతున్నారని తెలుస్తుంది. ఇటీవల కర్నాటక, తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పంచన చేరడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిలో భాగంగానే చంద్రబాబు బెంగుళూరు వెళ్ళి మరి అక్కడ ఉప ముఖ్యమంత్రి డికె.శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లోనే ఓ గదిలో రెండు గంటలకుపైగా మంతనాలు జరిపినట్టు సమాచారం.
ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య ఓ సయోధ్య కుదిరినట్టు సమాచారం. ఈ సమయంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు గురించి ఇరువురు నాయకులు చర్చించుకున్నట్టు తెలుస్తుంది.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితో జగన్‌పై విమర్శలు చేసేలా ఒత్తిడి చేయాలని డీకేను చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యవహరశైలిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఒకపక్క తమతో పొత్తులో ఉంటూనే మరోపక్క కాంగ్రెస్ పార్టీతో రహస్య మంతనాలు జరపడం ఏంటని వారు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే పవన్‌కు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారని జనసేన కార్యకర్తలు, నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే చంద్రబాబు ఇలా చేయడం కొత్తేం కాదని.. ఎన్నికల సయయంలో ఆయన ఎవరితోనైనా పొత్తుకు సిద్ద పడతారని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. 2009లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, 2014 ఎన్నికల్లో బీజేపీ , జనసేనతో పొత్తు పెట్టుకున్నారని..ఇక 2018 తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి అతి పెద్ద తప్పు చేశారని అధికార పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు జగన్‌ను ఢీ కొట్టడం ఒక్కడి వల్ల కాదని గ్రహించిన చంద్రబాబు తనకున్న దారులు మొత్తం కూడా ఈ రకంగా వాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
