గత కొన్నేళ్లుగా ఆరోగ్యశ్రీ చికిత్స ఫీజులను ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్యాకేజీ ధరలే కొనసాగుతున్నాయి. వాటిని పెంచాలని సైతం కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు బకాయిల చెల్లింపుల విషయంలో సైతం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోంది. వీటన్నింటిపై ఆగ్రహంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కొత్త కేసులను అడ్మిట్ చేసుకోమని వెల్లడించాయి.
తమ వి న్యాయ సమ్మతమైన డిమాండ్ లేనని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. అయినా సరే తమ విషయంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చేస్తోందని.. వెంటనే పెండింగ్ పక్కాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ హెచ్ ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమని.. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు రోగులకు అందవని స్పష్టం చేశాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు నిలిచిపోనుండడంతో రోగులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
