ప్రేమించిన వ్య‌క్తినే పెళ్లిచేసుకోబోతున్న జాన్వీక‌పూర్… వ‌రుడు ఎవ‌రో తెలుసా…?

అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ బాలీవుడ్‌లో మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.ఇప్ప‌డు జాన్వీక‌పూర్ పెళ్లి గురించి ఓ వార్త సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లో జాన్వీకపూర్ పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు, అది కూడా త‌ను ప్రేమించిన వ్య‌క్తినే పెళ్లిచేసుకుంటున్న‌ట్లు వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే, ఈ విష‌యంపై న‌టి జాన్వీక‌పూర్ కానీ, తండ్రి బోనీక‌పూర్‌ను ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ వార్త‌లో వాస్త‌వ‌మెంతో తెలియాల్సి ఉంది…

 

న‌టిగా మొదటి సినిమాతోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది జాన్వీ క‌పూర్‌. త‌న రెండో చిత్రం కూడా భారీ విజ‌యాన్ని అందుకుంది. జాన్వీక‌పూర్ ఎప్ప‌డూ సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. త‌న లెటేస్ట్ ఫోటోల‌తో యువ‌త‌ను ఎంత‌గానో అట్రాక్ట‌ట్ చేస్తుంటుంది. అయితే, ఈ మ‌ధ్య‌కాలంలో జాన్వీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.జాన్వీక‌పూర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని టాక్ బీ టౌన్ వ‌ర్గాల్లో తెగ వినిపిస్తోంది.

 

 

చిన్న‌నాటి స్నేహితుడే.. కాబోయే వ‌రుడు : ఇక జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఈ మూవీ అనంత‌రం రామ్‌చ‌ర‌ణ్‌తో కూడా జాన్వీ న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌టన రాలేదు. అయితే, ఎన్‌టిఆర్‌తో న‌టించే దేవ‌ర సినిమాతో జాన్వీ క‌పూర్ రేంజ్ ఎక్క‌డికి వెళ్లిపోతుంద‌ని అభిమానులు అంటున్నారు. గత కొంత‌కాలంగా జాన్వీ క‌పూర్ పెళ్లి గురించి అటు సోష‌ల్‌మీడియాలో ఇటు బీ టౌన్ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. జాన్వీ త్వరలోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది అంటూ బాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ విషయం విన్న ఆమె అభిమానులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.

 

ఇక జాన్వీ కపూర్ కాలేజీ డేస్‌లో తనతో ఎంతో స్నేహంగా మెదులుతున్న శిఖర్ పహారియతో ల‌వ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింద‌ని, అందుకే ఎక్క‌డా చూసిన వీరిద్ద‌రూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నార‌ని వినిపిస్తోంది. పార్టీలు, పబ్బులు అంటూ తిరగడమే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తున్నార‌ని కొన్ని మీడియా వ‌ర్గాలు అంటున్నారు. వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి సంబంధం ఉండటంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఏది ఏమైనా వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే సమాచారం మాత్రం బీ టౌన్‌లో తెగ వినిపించేస్తోంది. ఇక ఈ న్యూస్‌లో నిజమేంత ఉందో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు ఆగ‌క త‌ప్పదు…

Editor