ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. కొంత కాలంగా పురందేశ్వరి వర్సస్ వైసీపీ నేత విజయ సాయిరెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు ఇద్దరు పోటీ పోటీగా చేస్తున్నారు. ఇక, ఇప్పడు తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ అక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం పైన సాయిరెడ్డి తాజాగా పురందేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు.
పొత్తుల లెక్కలు : ఏపీలో బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ, జనసేన కోరుకుంటున్నాయి. బీజేపీతో కలవటం పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీతో కలవటం పైన బీజేపీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ ఎన్నికల తరువాతనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి పురందేశ్వరి టీడీపీ…చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయ సాయిరెడ్డి ఇదే విషయం పైన పలు సందర్భాల్లో పురందేశ్వరిపైన ఘాటు వ్యాఖ్యలు చేసారు. అటు పురందేశ్వరి సైతం సాయిరెడ్డితో పాటుగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.
MP Vijayasai Reddy questioned Purandeswari on TDP Cadre participate in Priyanka Vadras rallies holding flags
సాయిరెడ్డి తాజా ట్వీట్ : సాయిరెడ్డి బెయిల్ అంశం పైన పురందేశ్వరి నేరుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసారు. మద్యం కుంభకోణం చేసారంటూ సాయిరెడ్డి పైన ఆరోపణలు చేసారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశం పైన పురందేశ్వరి ఆచి తూచి స్పందిస్తున్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయని టీడీపీ కేడర్..కాంగ్రెస్ కు సహకరిస్తుందనే వాదన ఉంది. అటు పవన్ కల్యాణ్ తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో మైత్రి కొనసాగిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ కేడర్ మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే తాజాగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ర్యాలీలో టీడీపీ శ్రేణులు తమ పార్టీ జెండాలతో పాల్గొనటాన్ని సాయిరెడ్డి ప్రస్తావించారు.
