Latest Posts

608 మంది నామినేషన్లు రిజెక్ట్…

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా. పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 119 సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది నామినేషన్లు వేయగా 608 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఈ నెల 15 వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి జానారెడ్డి (నాగార్జున సాగర్), ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు (కోరుట్ల), ఈటల జమున (హుజూరాబాద్), మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ (మిర్యాలగూడ) తదితరుల నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి.

Editor