బెంగళూరు: బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో (Karnataka) వినాయక చవితి పండుగ మొదలైన తరువాత ఒక నెల రోజుల పాటు వివిద ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం కర్ణాటక (Karnataka)ప్రజలకు సాంప్రదాయంగా వస్తోంది.
వినాయక చవితితో పాటు కన్నడ రాజ్యోత్సవం కూడా నెల రోజుల పాటు నిర్వహించడం కర్ణాటకలో ఆనవాయితీగా వస్తోంది.
వినాయకుడి విగ్రహం ఊరేగింపు సందర్భంగా ఇంటి ముందు డ్యాన్స్ చేసే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో డ్రాగర్‌తో ఓ యువకుడిని పొడిచి చంపిన ఘటన బెంగళూరు (Bengaluru) నగరంలోని అడుగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడుగోడిలోని ఏకే కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు అలియాస్ శీను (25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు.
ఈ ఘటనలో శ్రీనివాస్ తల్లి ఇందిరా, అతని స్నేహితుడు రంజిత్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్య ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గురైన శ్రీనివాస్ బెంగళూరులోని (Bengaluru) ఓ కంపెనీలో కొరియర్ (courier company) బాయ్‌గా పనిచేస్తున్నాడు. వినయ్, అలెక్స్, రంజిత్, ప్రశాంత్ మరియు కొందరు స్నేహితులు అదే ప్రాంతంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
వినయ్ బ్యాచ్ కు పోటీగా అదే ప్రాంతంలోకి మరో రోడ్డులో శ్రీనివాసులు తదతరులు మరో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. గణేశుడి విగ్రహం ఊరేగింపు ఘనంగా ఎర్పాటు చెయ్యడానికి వినయ్ అండ్ కో ఏర్పాటు చేశారు. మరుసటి రోజు శ్రీనివాసులు అతని స్నేహితులు వారు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఊరేగింపులకు ఏర్పాట్లు చేశారు. వినయ్ తదితరులు వారు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఊరేగింపులో డ్యాన్స్ (dance) చెయ్యడం మొదలుపెట్టారు.
వినాయకుడి విగ్రహం ఊరేగింపు శ్రీనివాసులు ఇంటి ముందుకు వచ్చింది. ఆ సందర్బంలో మా ఇంటి ముందు మీరు డ్యాన్స్ (dance) చెయ్యకూడదని శ్రీనివాసులు వినయ్ తదితరులకు చెప్పాడు. డ్యాన్స్ (dance) చేసే విషయంలో శ్రీనివాస్, వినయ్ మధ్య గొడవ జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ ఇంటి ముందు కొంతసేపు వినాయకుడి విగ్రహం ఊరేగింపు ఆగిపోయింది.
మా ఇంటి ముందు డ్యాన్స్ (dance) చేయవద్దని వినయ్‌తో పాటు అతని స్నేహితులకు శ్రీనివాస్ గట్టిగా చెప్పాడు. ఈ విషయమై శ్రీనివాస్, వినయ్ కాడే మధ్య గొడవ మొదలైంది. ఈ సందర్భంగా స్థానికులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కొంతసేపటి తరువాత వినాయకుడి విగ్రహం ఊరేగింపు పక్కవీదిలోకి వెళ్లింది. తరువాత వినయ్, రంజిత్, అలెక్స్ సహా కొందరు మళ్లీ శ్రీనివాస్ ఇంటి దగ్గరకు వచ్చి వీరంగం సృష్టించారు.
మీ ఇంటి దగ్గర ఎందుకు డ్యాన్స్ (dance)చేయకూడదని గొడవకు దిగారు. ఈ సమయంలో డ్రాగర్‌ను తీసుకుని శ్రీనివాస్ కడుపులో పొడిచారు. గొడవు అడ్డుకునేందుకు వచ్చిన శ్రీనివాస్ తల్లి ఇందిరా, స్నేహితుడు రంజిత్‌లకు కూడా గాయాలయ్యాయి. డ్రాగర్ కత్తితో పొడవంతో (murder) కుప్పకూలిన శ్రీనివాస్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు అడుగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
