కుప్పం/తిరుపతి/చెన్నై: రాజకీయాలు అంటేనే ఎత్తులకు పై ఎత్తులు వేసుకోవడం అని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాలు ఎక్కడైనా రాజకీయాలే అని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు రోజురోజుకు రసవత్తరంగా మారిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు (chandrababu) అరెస్టు అయ్యి జైల్లో ఉండటంతో ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ మూడు సార్లు సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు (chandrababu) జైలుకు వెళ్లిన తరువాత కుప్పం నియోజక వర్గంలోని టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కుప్పం ( kuppam) నియోజక వర్గం నుంచి చంద్రబాబు నాయుడి (chandrababu) మీద ప్రముఖ తమిళ హీరో (Hero), సినీ నిర్మాత విశాల్ క్రిష్ణ అలియాస్ విశాల్ అలియాస్ విశాల్ (vishal) రెడ్డి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ (YCP) సీసీ అభ్యర్థిగా చంద్రబాబు మీద హీరో విశాల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా తరువాత పరిస్థితులు మారిపోయాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాల్ (vishal) కుప్పం నుంచి పోటీ చెయ్యలేదు.
కుప్పం నుంచి విశాల్ (vishal) ఎందుకు పోటీ చేస్తారు ? అనిచాలా మంది ఆరాతీశారు. అయితే కుప్పంలో మూడు సంవత్సరాల పాటు విశాల్ గ్రౌండ్ వర్క్ చేసిన విషయం చాలా మందికి తెలీదు. బహుబాష నటుడు, ప్రముఖ హీరో విశాల్ కు, కుప్పంకు ఉన్న సంబంధం ఏమిటి ? అని ఇప్పటికి చాలా మందికి తెలీదు. అయితే కుప్పంతో సినీ హీరో విశాల్ కు (vishal) సంబంధాలు ఉన్నాయి.
హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జీకే రెడ్డి అనేక జిల్లాల్లో వ్యాపారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జీకే రెడ్డి ఓ వెలుగు వెలిగారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ( kuppam) చాలా సంవత్సరాల పాటు జీకే రెడ్డి వ్యాపారం చేశారు. ఆ సందర్బంలో జీకే రెడ్ది కుమారులు అయిన విశాల్(vishal), విక్రమ్ క్రిష్ణ అలియాస్ విక్రమ్ తండ్రి వ్యాపారాలు చూసుకునేవాళ్లు.
విశాల్ (vishal) సినిమాల్లో నటించడానికి ముందు ఎక్కువగా ఆయన తండ్రి జీకే రెడ్డి వ్యాపారాలు చూసుకుంటూ చురుకుగా ఉండేవాడు. కుప్పంలో ( kuppam) జీకే రెడ్డి వ్యాపారం చేసే సమయంలో విశాల్ సినిమాల్లో నటించలేదు. ఆ సందర్బంలో చంద్రబాబు నాయుడు (chandrababu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (CM) పని చేస్తున్నారు. ఆ సమయంలో విశాల్ కుప్పం వెళ్లాడు.
కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్!
చాలా సంవత్సరాల పాటు జీకే రెడ్డి కుప్పంలో వ్యాపారపనిపై ఉండటంతో తండ్రి వ్యాపారాలు చూసుకోవడానికి విశాల్ (vishal), విక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. మూడు ఏళ్ల పాటు కుప్పంలో తన తండ్రి జీకే రెడ్డి వ్యాపారాలు చూసుకుంటున్న సమయంలో తాను కుప్పంలోని వీదివీది తిరిగానని, కుప్పంలో ప్రతి వీది తనకు తెలుసని, అక్కడి ప్రజలతో తనకు పరిచయాలు ఉన్నాయని, కుప్పంలో తాను మూడు ఏళ్లకు పైగా ఉన్నానని హీరో విశాల్ (vishal) ఇటీవల మీడియా ముందే చెప్పారు.
కుప్పంలోని కూలీలతో పాటు అక్కడి కాంట్రాక్టర్లతో తనకు చాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కుప్పంలో నివాసం ఉంటున్న చాలా మంది పేర్లు తనకు తెలుసని, ఇప్పుడు కూడా చాలా మంది తనకు టచ్ లో ఉన్నారని హీరో విశాల్ ఇటీవల ఓ సినిమా విడుదల సందర్బంగా మీడియాకు చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబుతో (chandrababu) కూడా తనకు, తన కుటుంబానికి పరిచయాలు ఉన్నాయని హీరో విశాల్ (vishal) చెప్పారు.
సినిమాల్లో నటిస్తున్న తాను ఇప్పుడు బిజీగా ఉన్నానని, కుప్పంలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, తన సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి నుంచి తనకు ప్రతి టిక్కెట్ మీద ఒక్కరూపాయి వస్తుందని, ఆ డబ్బునే తాను ప్రజల సేవ కోసం ఉపగించి వారికి సేవ చేస్తానని, ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని హీరో విశాల్ (vishal) అన్నారు.
ఇటీవల మాజీ సీఎం ( kuppam) చంద్రబాబు అరెస్టు విషయంలో ఇటీవల హీరో విశాల్ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబును (chandrababu) అనవసరంగా అరెస్టు చేసి జైలుకు పంపించడం తనకు బాదకలిగించిందని, ఆయన ఎలాంటి తప్పు చెయ్యలేదు అని తాను బావిస్తున్నానని, ఆయన త్వరగా బెయిల్ మీద బయటకు రావాలని కోరుకుంటున్నానని హీరో విశాల్ (vishal) చెప్పారు. కుప్పం నుంచి తాను ఎలాంటి పరిస్థితిలో పోటీ చెయ్యను అని హీరో విశాల్ క్లారిటీ ఇచ్చేశారు.
