మోదీ కర్ణాటక, తమిళనాడుకు మాత్రమే ప్రధాని కాదు, దేశం మొతానికి ప్రధాని, చెప్పింది !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కావేరి సమస్య కోసం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన సందర్బంగా బీజేపీ (BJP), కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు కూడా తీవ్రంగానే ఉంది.

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ (Congress)నేతలపై చేస్తున్న ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు.

కర్ణాటక రాష్ట్రంలో కావేరి పోరు ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న కాంగ్రెస్ నాయకుల డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై కూడా కాంగ్రెస్, బీజేపీ (BJP)మధ్య పోరు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) కావేరి జలాల విషయంలో జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతుంటే, కావేరి విషయంలో ప్రధాని మోదీ ఎందుకు జోక్యం చేసుకోవాలి? అని కర్ణాటక బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ అంశంపై నేడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే ప్రధాని కాదని, ఇతర రాష్ట్రాల జల వివాదాలను కూడా ఆయన పరిష్కరించాలని బీజేపీ నేతల అంటున్నారు. బీజేపీ నాయకుల తీరుతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగారు.

కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ !

కావేరి విషయంలో బీజేపీ దురహంకార ధోరణితో వ్యవహరిస్తోందనడానికి వారు చేస్తున్న ప్రకటనలే నిదర్శనం అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి (Modi) ఫోటోషూట్ చేసుకోవడానికే సమయం సరిపోవడం లేదని, ఇక కావేరి సమస్య పరిష్కారానికి సమయం ఎక్కడిది?’ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించడంతో బీజేపీ (BJP) నేతలకు చిర్రెత్తుకొచ్చింది.

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌లో (X)లో బీజేపీపై దాడిని కొనసాగించింది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కర్ణాటక నా కర్మభూమి అని తప్పుడు ప్రసంగం చేసే ప్రధాని నరేంద్ర మోదీ (Modi) కర్ణాటకకు ప్రధాన మంత్రి కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడమే తప్ప ఎన్నికల సమయంలో రోడ్డెక్కడం కాదని, ప్రధాని మోదీ గానీ, ఆయన పార్టీ గానీ కర్ణాటక సమస్యలు గుర్తించడం లేదని బీజేపీ నేతలపై కాంగ్రెస్‌ (congress) దాడి చేసింది.

కర్ణాటక బంద్, బంద్ అంటే ఇదే బాసు, 44 విమానాలు రద్దు, రక్తం ఇస్తాం కాని నీళ్లు ఇవ్వం !

కాంగ్రెస్ (congress) లాగే బీజేపీ కూడా కావేరీ సమస్యను ఆయుధంగా చేసుకుని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. తాగునీరులేక కన్నడిగులు చచ్చిపోయినా పర్వాలేదు, స్టాలిన్‌ ప్రభుత్వానికి నీళ్లివ్వడమే ఘనకార్యం అని సిద్దరామయ్య ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని (siddaramaiah) కేఆర్ ఎస్ డ్యామ్ ఖాళీ అయిపోయిందని, తరువాత కబినీ డ్యామ్ ఖాళీ అయ్యిందని, ఇప్పుడు రామనగర జిల్లాలోని చిన్నచిన్న డ్యామ్ ల మీద సిద్దరామయ్య ప్రభుత్వం కన్నుపడిందని కర్ణాటక బీజేపీ నాయకులు ఆరోపించారు.

మేము పక్కా కాంగ్రెసోళ్లమని (congress) తమిళనాడు సీఎం స్టాలిన్ కు బానిసలు అని, కావేరి నీరు వాళ్లు ఎప్పుడు అడిగినా ఇచ్చేస్తామని సిద్దరామయ్య ప్రభుత్వం తలఊపుతోందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కన్నడిగులకు, కర్ణాటకకు ద్రోహం చేస్తున్న ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం స్టాలిన్ కు బానిసల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah), ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వారి పదవులకు అనర్హులని, వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ తన ట్వీట్‌లో ఆరోపించింది. అధికార దాహం ఉంటే తమిళనాడు వెళ్లి స్టాలిన్ మంత్రివర్గంలో మంత్రులుగా చేరవచ్చు అని, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కర్ణాటకలోని కాంగ్రెస్ (congress) ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

YES9 TV