ఇక్కడ చంద్రబాబు నిరసనలొద్దు-లోకేష్ కూ అదే చెప్పా-అందరూ ఫ్రెండ్సేనన్న కేటీఆర్..

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా తెలంగాణలో జరుగుతున్న నిరసనలపై మంత్రి కేటీఆర్ ఇవాళ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అక్కడి రెండు పార్టీల మధ్య విషయమని కేటీఆర్ తెలిపారు.

అది ఏపీకి చెందిన విషయమని, హైదరాబాద్ లో ర్యాలీలు తీయడం, ప్రతిగా ఇంకో పార్టీ చేయడం సరి కాదన్నారు. ఏపీకి చెందిన విషయాన్ని ఆందోళనలు అక్కడే చేయాలని కేటీఆర్ సూచించారు.

ర్యాలీల వల్ల ఐటీ కంపెనీల విషయంలో ఇబ్బందులు వస్తాయని కేటీఆర్ తెలిపారు. తనకు ఏపీ నేతలతో ఎటువంటి ఇబ్బంది లేదని కేటీఆర్ తెలిపారు. తనకు జగన్, చంద్రబాబు, పవన్ అందరూ మిత్రులే అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా తమ పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడి ఉంటే అది వారి వ్యక్తిగతమన్నారు. దీనిపై తమ స్టాండ్ స్పష్టంగానే ఉందన్నారు. చంద్రబాబు ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు.

చంద్రబాబు అరెస్ట్ తో తెలంగాణ కు ఏం సంబంధం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ లో ఎందుకు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారని నిరసనకారుల్ని ప్రశ్నించారు. ఏపీలో ఏమన్నా చేసుకోండని వారికి సూచించారు. ఇది రెండు రాజకీయ పార్టీల తగాదా ఇందులో తమకేం సంబంధం అని ఆయన అడిగారు. ఇక్కడ ఎలాంటి ఆందోళనలు చేయద్దని కేటీఆర్ సూచించారు.

చంద్రబాబు అంశం కోర్టులో ఉందని గుర్తుచేశారు.

చంద్రబాబు అరెస్టు విషయంలో నిరసనలతో తెలంగాణాలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తనకు లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వమని అడిగారని కేటీఆర్ వెల్లడించారు. అయితే హైదరాబాద్ లో శాంతి భద్రతలు ముఖ్యం అని ఆయనకు చెప్పామని కేటీఆర్ తెలిపారు.

YES9 TV