సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటారు. రాజకీయంగా, సామాజికంగా జరుగుతున్న మార్పులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు.
సంఘటన ఎటువంటిదనైనప్పటికీ తనదైన శైలిలో స్పందించడం ఆమె లక్షణం. తాజాగా ఆమెకు ఢిల్లీకి రావాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది.
ఈ పిలుపు ఎందుకు? అనే కోణంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి ఆహ్వానించడానికి ఢిల్లీకి పిలిపిస్తున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ తమ బలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచుకు ఆహ్వానం పంపించారనే టాక్ నడుస్తోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మహిళలను ఇన్వైట్ చేస్తున్నారు. అందులో భాగంగా లక్ష్మిని పిలిచివుంటారంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇలా మోడీ కార్యాలయం నుంచి లక్ష్మికు పిలుపు రావడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
ఏపీలోని రాజకీయ పరిణామాలపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆమె స్పందించిన తీరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. వావ్.. ఏపీ పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిపై కొంతమంది ఆమెకు అనుకూలంగా స్పందిస్తే మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు.
