ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన నోటి దూలతో మిత్ర దేశాలను దూరం చేసుకుంటున్నాడు. రష్యాతో యుద్ధం ప్రారంభమైన నుంచి ఉక్రెయిన్ కు పోలాండ్ అండగా నిలుస్తూ వస్తోంది.
అయితే ఇక నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడం లేదని పోలాండ్ తేల్చి చెప్పింది. దీంతో ఉక్రెయిన్ కు భారీ షాక్ తగిలినట్లయింది. నాటో నుంచి వచ్చిన ఆయుధాలను పోలాండ్ తరలించే వారు అక్కడి నుంచి ఆ ఆయుధాలను ఉక్రెయిన్ కు రోడ్డు, రైల్వే మార్గాల్లో పంపేవారు. ఇలా ఉక్రెయిన్ పోలాండ్ అన్ని రకాల సాయం చేసింది.
పోలాండ్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది. ఈ సంవత్సం ప్రారంభంలో యూరప్ సమాఖ్య ఉక్రెయిన్ నుంచి ధాన్యం దిగుమతులను నిషేధించింది. ఉక్రెయిన్ తక్కువ ధరకు ధాన్యం దిగుమతి చేసుకుంటే తమ దేశంలో రైతులు నష్టపోతారని సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించారు. యూరోప్ సమాఖ్య నిర్ణయాన్ని పోలాండ్, హంగేరి, స్లోవేకియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉక్రెయిన్ ధాన్యాన్ని తమ దేశంలోకి అనుమతించమని స్పష్టం చేశాయి.
దీనిపై జెలెన్ స్కీ స్పందించారు. రాజకీయంగా సాయం చేస్తున్నట్లు కనిపించినా.. ధాన్యం నుంచి లబ్ధిపొందాలని చూస్తున్నారని పోలాండ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వారు సొంతంగానే తమ పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తున్నా.. మాస్కోలోని వారి కోసం అసలు వేదికను సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. జేలెన్ స్కీ వ్యాఖ్యలోత మండిపోయిన పోలాండా అనూహ్య నిర్ణయం తీసుకుంది. పోలాండ్ ఇకపై ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. తమ స్వంత ఆయుధాల నిల్వలను నిర్మించుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పోలాండ్ ప్రకటింటింది.
ధాన్యం నిషేధాన్ని పొడిగించాలని పోలాండ్ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఉక్రేనియన్ రాయబారిని పిలిపించి మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి ధాన్యం, ఆహార దిగుమతుల ఉప్పెన నుంచి పోలిష్ రైతులను రక్షించడానికి పోలాండ్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ వివాదంపై స్పందించింది. శాంతించాలని పోలాండ్ ను కోరింది. నల్లసముద్రం ధాన్యం డీల్‌ను రద్దు చేసుకొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయంతో ఉక్రెయిన్ మిత్ర దేశాలకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
