బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ శిబిరంలో అసంతృప్తి పెరిగింది.
ఒకటి పోతే మరొక సమస్యతో సిద్ధరామయ్య ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద బహిరంగంగా చాలా మంది నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు,
అనేక సమస్యల మధ్య మరో మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆ పార్టీ నాయకుల ఒత్తిడి పెరిగింది. గతంలో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూడా సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య చాలా పోటీ నెలకొంది. ఆ సందర్భంలో ఒకే ఒక్క ఉపముఖ్యమంత్రి పదవిని కల్పించాలని డీకే శివకుమార్ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
మాజీ ఉద్యోగులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్, 200 ఎకరాలకు స్కెచ్, భూమన!
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌లో ఒకే ఒక్క డీసీఎం పదవిని సృష్టించి డీకే శివకుమార్ నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే మంత్రి కేఎన్ రాజన్న మరన్ని ఉప ముఖ్యమంత్రి పదవుల గురించి మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన కేఎన్ రాజన్న లింగాయత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డీసీఎం పదవులు ఇవ్వాలని హైకమాండ్‌కు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని, ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలంటే మరో ముగ్గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని రాజన్న అంటున్నారు. లేఖ రాయడంతో పాటు ఢిల్లీకి వెళ్లి పార్టీ నేతలతో చర్చించాలని కూడా కోరినట్లు కేఎన్ రాజన్న తెలిపారు.
కుప్పం ఎన్ టీఆర్ సర్కిల్ లోకి నో ఎంట్రీ, టీడీపీ ఏం చేసిందంటే ?, మాకు టైమ్ వస్తుంది!
జీ. పరమేశ్వర్ (హోమ్ మంత్రి), సతీష్ జారకిహోళి (పబ్లిక్ వర్క్స్ మినిస్టర్) లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నేత బీకే. హరిప్రసాద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కేఎన్ రాజన్న ప్రకటన కూడా కర్ణాటక ప్రభుత్వంలో పెను సంచలనం సృష్టించింది. డీకే శివకుమార్‌ను కట్టడి చెయ్యాలని సిద్ధరామయ్య శిబిరం డీసీఎం పదువుల ప్లాన్ సిద్దం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా డీకే. శివకుమార్ ప్రభావాన్ని దెబ్బతీసేందుకు అదనపు ఉప ముఖ్యమంత్రుల పదవులు కావాలని సిద్ధరామయ్య సన్నిహితుల ద్వారా ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ముఖ్యమంత్రి పదవికి కూడా అండగా నిలిచారు.
