గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు

గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతోంది. మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గండిమైసమ్మ నుంచి చార్మినార్ మధ్య ‘లేడీస్ స్పెషల్’ బస్సును ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) వెల్లడించింది.

ఇందుకు సంబంధించి తెలంగాణల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఎక్స్(ట్వీట్) చేశారు. సెప్టెంబర్ 13 నుంచి గండిమైసమ్మ, జీడిమెట్ల, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, లక్డీకాపూల్, గాంధీభవన్, అఫ్జల్‌గంజ్‌ల మీదుగా చార్మినార్ వెళ్తుంది.

ఈ బస్సు బుధువారం నుంచి అందుబాటులో కి వచ్చింది. ప్రతిరోజూ ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి చార్మినార్ వైపు వెళ్తుంది. సాయంత్రం 5 గంటల 20 మనిషాలకు చార్మినార్ నుంచి గండిమైసమ్మ బయల్దేరుతుంది. దీనికి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని సేవలు ఈ మార్గంలో అమలు చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. బస్సు నంబర్ 9ఎక్స్/272 గండిమైసమ్మ నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి గండిమైసమ్మ వెళ్తోంది. ఇది కేవలం మహిళలకే.. ఈ బస్సులో పురుషులు ఎక్కరాదు.

“మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. చార్మినార్-గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించింది. 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్.. బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రోజు ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాలానగర్, ముసాపేట, ఎర్రగడ్డ, అమీర్ పేట, లక్దికాపుల్, గాంధీ భవన్, అఫ్జల్ గంజ్ మీదుగా చార్మినార్ వెళ్తుంది. సాయంత్రం 5:20 గంటలకు అదే మార్గంలో చార్మినార్ నుంచి గండి మైసమ్మకు బయలుదేరుతుంది. ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు” అని సజ్జనార్ పేర్కొన్నారు.

Editor