ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్స్‌తో డబ్బుల వర్షం.. రూ.10 లక్షలకు పైగా పొందండిలా!

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనాసగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పలు రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు కూడా ఉన్నాయి.

బ్యాంక్‌లో (Bank) కస్టమర్లు ఎఫ్‌డీ అకౌంట్ తెరవొచ్చు. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు (Money) దాచుకోవచ్చు. అంతేకాకుండా ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ పథకాలను కూడా అందుబాటులో ఉంచింది. మీరు ఎంచుకునే ఎఫ్‌డీ స్కీమ్ ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది. రెగ్యులర్ కస్టమర్లకు అయితే 3 శాతం నుంచి 7.1 శాతం వరకు, అదే సీనియర్ సిటిజన్లకు అయితే 3.5 శాతం నుంచి 7.6 శాతం వరకు వడ్డీ వస్తుంది.

ఎస్‌బీఐ అందిస్తున్న స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ విషయానికి వస్తే.. ఎస్‌బీఐ రెండు పథకాలు అందుబాటులో ఉంచింది. వీటిల్లో అమృత్ కలశ్, ఉయ్ కేర్ అనేవి ఉన్నాయి. ఎస్‌బీఐ ఉయ్ కేర్ డిపాజిట్ విషయానికి వస్తే.. ఈ స్కీమ్ కింద ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో చేరితే అధిక వడ్డీ పొందొచ్చు. గరిష్టంగా 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. బ్యాంకుల కీలక నిర్ణయం?

అలాగే అమృత్ కలశ్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. దీని విషయానికి వస్తే.. ఈ స్కీమ్ టెన్యూర్ 400 రోజులు. ఈ పథకంలో చేరితో 7.6 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. సీనయిర్ సిటిజన్స్‌కు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. అదే రెగ్యులర్ కస్టమర్లకు అయితే వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంటుంది. ఈ స్కీమ్ ఈఏడాది చివరి వరకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది.

రూ.100తో 400 కి.మి వెళ్లండి.. మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్!

బైక్ కొనండి”>

మీరు ఉదాహరణకు ఎస్‌బీఐ ఉయ్ కేర్ స్కీమ్‌లో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో ఎంత మొత్తం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పదేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం.. కస్టమర్లకు మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.10 లక్షల 50 వేలు లభిస్తాయి. అంటే వడ్డీ రూపంలో రూ. 5.5 లక్షలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే పెట్టిన డబ్బు రెట్టింపు అయ్యిందని చెప్పుకోవచ్చు. అదే రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ.21 లక్షలకు పైగా పొందొచ్చు.

Editor