బంగారంతో డబ్బు రెట్టింపు. ఎలా అని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫిజికల్ గోల్డ్ కొంటే మీరు దాన్ని ఇంట్లో పెట్టుకోవాల్సిందే.
లేదంటే బ్యాంక్‌లో (Bank) పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. అవసరం తీరిన తర్వాత మళ్లీ లోన్ డబ్బులు (Money) కట్టి బంగారం ఇంచికి తెచ్చుకోవడమే. ఇలా ఫిజికల్ గోల్డ్ కొనడం వల్ల అంటే బంగారు నగలు కొనడం వల్ల వచ్చే రాబడి ఏమీ ఉండదు. కానీ మీరు బంగారు ఆభరణాలు కాకుండా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్లు కొంటే అదిరే రాబడి పొందొచ్చు.
మీరు పేటీఎం నుంచి వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. లేదంటే ప్రభుత్వం గోల్డ్ బాండ్ స్కీమ్ అందిస్తోంది. దీని ద్వారా కూడా మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. డిజిటల్ గోల్డ్ అయితే మార్కెట్ రేటుకు కొనాలి. తర్వాత దీన్ని ఫిజికల్ రూపంలో డెలివరీ పొందొచ్చు. లేదంటే డబ్బులు పొందొచ్చు. ఇలా రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. అయితే ప్రత్యేకంగా అదనపు రాబడి అంటూ ఏమీ ఉండదు. గోల్డ్ రేటు పెరిగితే లాభం పొందొచ్చు. అదే మీరు గోల్డ్ బాండ్లు కొంటే.. అప్పుడు మీకు గోల్డ్ రేటు పెరిగితే లాభం వస్తుంది. ఇంకా ఏటా వడ్డీ కూడా లభిస్తుంది.
ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్స్‌తో డబ్బుల వర్షం.. రూ.10 లక్షలకు పైగా పొందండిలా!
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సారి గోల్డ్ బాండ్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మీరు మార్కెట్ రేటు కన్నా తక్కువకే బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 15 వరకు గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ. 5923గా నిర్ణయించింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్లను కొంటూ అదనంగా గ్రాముకు రూ. 50 తగ్గింపు వస్తుంది.
బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. బ్యాంకుల కీలక నిర్ణయం?
ఈ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏటా 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. ఇంకా మెచ్యూరిటీ సమయంలో గోల్డ్ బాండ్లను మార్కెట్ ధరతో విక్రయించుకోవచ్చు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లు. అయితే 5 ఏళ్ల తర్వాతి నుంచి మీరు ముందుగానే బాండ్లను విక్రయించుకోవచ్చు. ఐబీజేఏ ప్రకటించిన 24 క్యారెట్ల బంగారం ధరను ప్రామాణికంగా మీరు గోల్డ్ బాండ్లను విక్రయించుకోవాల్సి ఉంటుంది. గత మూడు రోజుల బంగారం ధరల సగటను గోల్డ్ బాండ్ల విక్రయినికి నిర్దేశిస్తారు.
మీరు కనీసం ఒక గ్రాము నుంచి బంగారం కొనొచ్చు. గరిష్టంగా 4 కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనొచ్చు. కంపెనీలు అయితే 20 కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనే ఛాన్స్ ఉంటుంది. కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరొషన్, క్లియరింగ్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీస్‌లు, స్టాక్ ఎక్స్చేంజీలు వంటి వాటి నుంచి మీరు గోల్డ్ బాండ్లను సులభంగానే కొనొచ్చు. గోల్డ్ బాండ్ స్కీమ్ 2015 నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పుడు గోల్డ్ బాండ్ ధర గ్రాముకు రూ. 2684. ఇప్పుడు దీని ధర రూ.5923. అంటే గత ఏడేళ్ల కాలంలో గోల్డ్ బాండ్లు 120 శాతం రాబడి అందించాయని చెప్పుకోవచ్చు.
