సనాతన ధర్మం మలేరియా, డెంగీ వ్యాధుల లాంటిదంటూ, దాన్ని నిర్మూలించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతుండడంతో తమిళనాడు (Tamil Nadu) మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
‘ సనాతన ధర్మం గురించి ఇటీవల నేను మాట్లాడాను. మొన్న నేను చెప్పింది మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాను. నేను హిందువులనే కాదు.. అన్ని మతాలనూ ఉద్దేశించి అన్నాను. కులం పేరిట ఉన్న భేదాలను ఖండిస్తూ మాట్లాడాను ‘ అని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు.
కాగా, ఉదయనిధి స్టాలిన్ శనివారం చేసిన కామెంట్లపై దేశ వ్యాప్తంగా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో హిందువులు నిరసన తెలుపుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ లబ్ధి కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అంటోంది
