PSLV-XL రకం 25వ నౌక- చంద్రుడు, సూర్యుడిపైకి వెళ్లిన రికార్డు..!

సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు భూమికీ,సూర్యుడికీ మధ్యన ఉన్న లాగ్రేడియన్ పాయింట్ కు ఇవాళ భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఆదిత్య ఎల్ 1ను ప్రయోగిస్తోంది.

ఉదయం 11.50 నిమిషాలకు జరిగే ఈ ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో వాడుతున్న పీఎస్ఎల్వీ-ఎక్సెల్ రకం నౌక దీంతో కలిపి ఇప్పటివరకూ 25 ప్రయోగాల్లో వాడారు. ఇది 25వ ప్రయోగంగా రికార్డు సృష్టించబోతోంది. అలాగే ఈ పీఎస్ఎల్వీ రకం రకం నౌక చంద్రుడిపైకీ, సూర్యుడిపైకీ వెళ్లిన అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకోబోతోంది.

ఇవాళ ఆదిత్య-ఎల్1 మిషన్‌ను ప్రారంభించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడు మరియు అంగారక గ్రహంపై భారతదేశం యొక్క మొదటి మిషన్‌లను ప్రారంభించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రకం నౌకను వాడుతోంది. పీఎస్ఎల్వీ సీ57 లేదా ఆదిత్య ఎల్ 1 మిషన్‌ ద్వారా భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ ను ప్రయోగించబోతోంది. దీంతో మన దేశీయ పీఎస్ఎల్వీ నౌక సిరీస్ 25వసారి అంతరిక్ష ప్రయోగానికి వెళ్లినట్లవుతోంది.

పీఎస్ఎల్వీ-ఎక్సెల్ పూర్తి కాన్ఫిగరేషన్ చూస్తే పీఎస్ఎల్వీ, ఆరు స్ట్రాప్-ఆన్ మోటార్లతో అమర్చబడి ఉంటుంది. ఈ సిరీస్ లో అత్యంత ఖరీదైన నౌక ఇదే. ఈ ఎక్సెల్ కాన్ఫిగరేషన్ మొదటిసారిగా అక్టోబర్ 2008లో భారతదేశపు మొదటి చంద్రుని పరిశోధన చంద్రయాన్-1ని ప్రయోగించడానికి ఉపయోగించారు. నవంబర్ 2013లో ప్రారంభించిన మార్స్ ఆర్బిటర్ మిషన్- మంగళయాన్ సహా అనేక అత్యున్నత ప్రయోగాలకు దీన్ని వాడారు.

పీఎస్ఎల్వీ చివరి సారి నవంబర్ 2022లో ఎక్సెల్ కాన్ఫిగరేషన్‌లో ప్రయాణించి, EOS-06 ఉపగ్రహం, ప్రధాన పేలోడ్ మరియు ఎనిమిది నానో-ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ఉంచింది.గత రెండు పీఎస్ఎల్వీ మిషన్లు ఈ ఏడాది ఏప్రిల్, జూలైలో TeLEOS-2, DS-SAR ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచిన పీఎస్ఎల్వీ-సీ55, పీఎస్ఎల్వీ-సీ56, సీఏ రకాన్ని ఉపయోగించాయి.

ఇవాళ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ57/ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ ప్రయోగించాల్సి ఉంది. ఆదిత్య-L1 అంతరిక్ష నౌక, సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఏడు సైంటిఫిక్ పేలోడ్‌లతో ప్రయోగిస్తున్నారు. ఇది 1,480.7 కిలోల బరువుతో రూపొందిన భారతదేశపు మొదటి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ-క్లాస్ సోలార్ మిషన్. 4 నెలల ప్రయాణంలో 1.5 మిలియన్ కి.మీ.లు ప్రయాణించాక లాగ్రాంజియన్ పాయింట్ L1 వద్ద హాలో ఆర్బిట్‌లో దీన్ని ఉంచుతారు.

Editor