విమానంలో బాంబు ఉందంటూ ఓ బాలుడు ఫోన్ చేయడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యాడు. వెంటనే బాంబు స్క్వాడ్ తో తనిఖీ చేయించారు. అయితే ఎలాంఇ బాంబు లేదని నిర్ధారించారు.
దీంతో అందురు ఊపిరి పీల్చుకున్నాడు. ఆకతాయిగా బాలుడు ఫోన్ చేసినట్లు తేల్చారు. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో బాంబు పెట్టినట్లు ముంబై పోలీసులకు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఒక విమానంలో బాంబు ఉందని కాలర్ తెలిపిన 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్ అధికారులు కాల్ అందుకున్నారని పోలీసు అధికారి పేర్కొన్నారు. ప్రమాదం జరగకుండా ఆపడానికి బాలుడు పోలీసులు సాయం కూడా కోరాడని వివరించారు. దీంతో వెంటనే తనిఖీలు చేపట్టి బాంబు లేదని తేల్చారు. అయితే పోలీసులు ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు. సతారా జిల్లా నుంచి 10 ఏళ్ల బాలుడు కాల్ చేసినట్లు కనుగొన్నారు.
సదరు బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బాలుడు ఓ వ్యాధికి చికిత్సు తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆదివారం ముంబై విమానాశ్రయం నుంచి పోలీసులకు బూటకపు కాల్స్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితుడిని రుక్సార్ ముక్తార్ అహ్మద్‌గా గుర్తించారు. ముంబయి విమానాశ్రయంలో అరెస్టు చేసిన నిందితుడిని మాల్వాని పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
జూలై 29న గోవా విమానాశ్రయంలో బాంబు బెదిరింపు గురించి బూటకపు కాల్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. జూలై 29 సాయంత్రం 4:45 గంటలకు, పోలీసులకు ఓ కాల్ వచ్చింది.”విమానాశ్రయంలో బాంబు పేలుడు సంభవించవచ్చు” అని కాలర్ పేర్కొన్నాడు. అయితే విమానాశ్రయం నిర్దిష్ట ప్రదేశం గురించి ప్రస్తావించలేదు. కాల్ అందుకున్న తర్వాత, గోవా పోలీసులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)తో కలిసి దబోలిమ్ ఎయిర్‌పోర్ట్, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లలో అన్ని భద్రతా చర్యలను చేపట్టారు.
