కేసీఆర్‌ను వణికించే వార్త.. కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే వార్త..

తెలంగాణ ఎన్నికల రేసులో అందరికంటే ముందు ఉండాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇండియా టుడే షాక్‌ ఇచ్చింది.

ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి మంచి ఊపు మీద ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ తెలంగాణ సర్వే అంచనా ఆ ఉత్సాహాన్ని నీరుగార్చింది.

కాంగ్రెస్‌కు ఎడ్జ్‌..
తాజా సర్వేలో కాంగ్రెస్‌కు ఎడ్జ్‌ వచ్చినట్లు ఇండియా టుడే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 19 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ సీట్లు.. 9 నుంచి 6కు తగ్గుతాయని తెలిపింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ స్థానాలు 3 నుంచి 8కి పెరుగుతాయని తేల్చింది. ఇక బీజేపీ సీట్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాలను నిలబెట్టుకుంటుందని వెల్లడించింది.

కాంగ్రెస్‌లో జోష్‌..
తాజా ఇండియా టుడే సర్వే ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపుతాయనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో తాము ముందు ఉన్నామని పిస్తున్న బీఆర్‌ఎస్‌కు నిరుత్సాహం తప్పదు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న గులాబీ బాస్‌కు నిజంగా ఈ ఫలితాలు షాక్‌ అనే చెప్పాలి. ఇక బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని, దక్షిణాది నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి కూడా తాజా ఫలితాలు ఇబ్బందికరమే. ఈ సర్వే చూస్తుంటే కర్ణాటక ఫలితాల ఇంపాక్ట్‌ తెలంగాణపై పడుతుందని ఇండియా టుడే అంచనా వేసింది. ఇది ఎన్నికల నాటికి ఇంకా పెరొగొచ్చని భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నిలు భిన్నం..
అయితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా స్థానిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. సర్వే ఫలితాల ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల పై ఉంటుంది. కానీ పూర్తిగా మారిపోతాయని మాత్రం చెప్పలేం. తెలంగాణ ఎన్నికల నాటికి ప్రజల మూడ్‌ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని తెలుస్తోంది.

కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో..
ఇక ఇండియా టుడే సర్వేపై బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. తప్పులు సరిదిద్దుకుంటారా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారో వేచి చూడాలి.

YES9 TV