చంద్రయాన్-3 విజయంతో ప్రపంచం చూపు భారత్ పై పడింది. భారత కీర్తిని ప్రపంచదేశాలు చాటి చెప్పాయి. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు మన దాయాది దేశం పాక్ మీడియా కూడా మన చంద్రయాన్-3 ప్రాముఖ్యతను ఇచ్చాయి.
ప్రపంచ దిగ్గజ పత్రికాలన్ని భారత్ సాధించిన విజయాన్ని కొనియాడాయి. కొద్ది రోజుల క్రితం భారత సామర్థ్యాలపై అనుమానం వ్యక్తం చేస్తూ న్యూయార్క్ టైమ్స్ వ్యంగ్య కార్టూన్ ను ప్రచురించాయి.
అయితే ఆ పత్రికకు చంద్రయాన్ 3 విజయంతో భారత విజయాన్ని కీర్తించక తప్పలేదు. చంద్రాయన్ 3 విజయంపై వాషింగ్టన్ పోస్ట్, బీబీసీ కథనాలు ప్రచురించాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా భారత విజయాన్ని కొనియాడింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ భారత్ ను ప్రశంసించారు. 21 శతాబ్దంలో చైనా తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టిన రెండో దేశంగా ఇండియా నిలిచిందని సీఎన్ఎన్ పేర్కొంది.
దాయాది పాకిస్థాన్ మీడియా కూడా చంద్రయాన్ 3 విజయంపై ప్రాముఖ్యత ఇచ్చాయి. చంద్రయాన్ 3 మిషన్‌పై అనేక పాకిస్తానీ వార్తాపత్రికలు గురువారం మొదటి పేజీ కథనాలను ప్రచురించాయి.పాకిస్తాన్ మంత్రులు,మీడియా ప్రముఖులు దీనిని భారతదేశ అంతరిక్ష సంస్థ ఇస్రోకు చెప్పుకోదగ్గ విజయంగా పేర్కొన్నారు.చంద్రుని దక్షిణ ధృవాన్ని అధిగమించిన మొదటి దేశంగా భారత్ ఆవతరించిందిని పాకిస్తాన్ వార్తాపత్రికలు, వెబ్‌సైట్‌లచే స్పష్టంగా హైలైట్ చేశాయి.
కరాచీకి చెందిన షమీనా బేగం తన అభిప్రాయాలను ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలిపింది.”అధిక ద్రవ్యోల్బణం, అంతర్గత సంఘర్షణల మధ్య పాకిస్తాన్ ఆహారం, విద్య వంటి ప్రాథమిక విషయాల కోసం పోరాడుతుండగా, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ దూసుకెళ్తుంది” అని చెప్పారు. భారత్, ఇస్రోను అభినందిస్తూ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె ఓ ప్రకట చేశారు. చంద్రయాన్ 3 విజయం పై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అభినందనలు తెలిపారు. USSR, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా తర్వాత చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నాల్గవ దేశంగా భారత్ బుధవారం అవతరించింది.
