విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, సికింద్రాబాద్ వారికి ముఖ్య గమనిక

తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ లో మూడోలైనుకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో రైళ్లను అధికారులు రద్దు చేశారు.

భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాస్ పూర్-ధన్ మండల్ సెక్షన్ లో ముందస్తు ఇంటర్ లాకింగ్ పనుల వల్ల రైలు సేవలను కొన్నిటిని రద్దు చేయగా మరికొన్నిటిని పాక్షికంగా రద్దు చేశారు.

ఈ జాబితాను రైల్వే ట్విటర్ లో విడుదల చేసింది. ఈనెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 75 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్-ముంబయి, హౌరా-సికింద్రాబాద్, భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే ఆరు సర్వీసులు ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భువనేశ్వర్ కు బదులుగా ఖుర్దా రోడ్ నుంచే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రద్దయిన, పాక్షికంగా రద్దయిన రైళ్ల జాబితాను ఈస్ట్ కోస్ట్ రైల్వే ట్విటర్ లో ఉంచింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ-గుండాలా సెక్షన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో వీటిని రద్దు చేశారు. ఈనెల 22వ తేదీ నుంచి నెలాఖరు వరకు వివిధ తేదీల్లో వీటిని రద్దు చేశారు. రద్దయిన వాటిలో విశాఖ-లింగంపల్లి జన్మభూమి, గరీబ్ రథ్ రైలుతోపాటు విశాఖ-చెన్నై, తిరుపతి-భువనేశ్వర్, హైదరాబాద్-కటక్ వంటి రైళ్లను కూడా రద్దు చేశారు. విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-నర్సాపురం మధ్య నడిచే రైళ్లకు స్టాప్స్ మార్చారు. బాలసోర్ వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులుర జరుగుతున్నాయి. దీంతో ఆయా స్టేషన్ల మధ్య తిరిగే రైళ్లను వారం పాటు రద్దుచేశారు.

Posted Under AP
YES9 TV