యంగ్ హీరోయిన్స్ శ్రీలీల, మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఊపులో ఉన్నారు. కెరీర్లో ఫుల్ జోష్‌లో దూసుకెళ్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్..
పూజాహెగ్డే, రష్మికకు తలనొప్పిగా మారినట్టు అనిపిస్తోందని తెలుస్తోంది. వివరాళ్లోకి వెళితే..
కొత్త సరుకు ఎప్పుడూ..: సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. కొత్త సరుకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కొత్తదనానికి.. కొత్త అందాలకు.. ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతిస్తుంది టాలీవుడ్. అందుకే ఎప్పటికప్పుడు కొత్త వారు వస్తూనే ఉంటారు. వారి అదృష్టం బాగుంటే ఒక్క సినిమాతో స్టార్‌గా మారిపోయి వరుస అవకాశాలను అందుకుంటుంటారు. అయితే కొత్త వారు రావడంతో పాత వారికి క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోతుంటాయి. కొన్ని సార్లు వారికి వచ్చిన ఛాన్స్‌లు కూడా మధ్యలో వదిలేసి వెళ్లిపోతుంటాయి. దీంతో వారి కెరీర్ సందిగ్ధంతో పడిపోతుంది. దీంతో చెసేదేమిలేక మెల్లమెల్లగా అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుంటుంది. ఇప్పుడు పూజాహెగ్డే పరిస్థితి అలానే కనపడుతోంది. రష్మిక ఆ జాబితాలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
అనిల్ రావిపూడి మాస్టర్ స్కెచ్.. బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోతోనే సినిమా.. తెలిస్తే పక్కా సర్ప్రైజ్!
అన్నీ శ్రీలీలకే..: పూజాహెగ్డే.. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లను అందుకుంటూ దూసుకెళ్లింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంది. కానీ ఈ ముద్దుగమ్మకు గతేడాది నుంచి కలిసి రావట్లేదు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో మొదలై.. ‘బీస్ట్’ , ‘ఆచార్య’, హిందీ చిత్రాలు ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అన్ని బాక్సాఫీస్ వద్ద అన్నీ డిజాస్టర్‌గా నిలిచాయి. అలా గతేడాది నుంచి గ్యాప్ లేకుండా ఐదు పరాజయాలను అందుకంది. దీంతో దర్శక నిర్మాతలు ఆమెను కాస్త పక్కకి పెట్టినట్టున్నారు. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ VD 12లో పూజాను తప్పించి శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు.
