Latest Posts

ప్రపంచంలోనే రెండో అందమైన నగరం.. మన ‘సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్ పూర్’..

హాలిడేస్‌ రాగానే.. చాలా మంది ఎక్కడికి వెళదాం.. ఏ నగరంలో గడుపుదాం.. ఏ సిటీని సందర్శింద్దాం.. ఖర్చులు ఎక్కడి వెళితే ఎంత..

ఎక్కువ, తక్కువల గురించి లెక్కలు వేసుకుంటారు. తమ అనుకూలతలను బట్టి ప్లాన్‌ చేసుకుంటారు. ఇలా ప్రపంచంలో అనేక వెకషన్‌ సిటీలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది మెచ్చే నగరాలు ఏంటి అని ట్రావెల్‌ అండ్‌ లీజర్‌ మ్యాగజైన్‌ ఇటీవల అన్వేషించింది. ప్రపంచంలో పది అత్యుత్తమ నగరాలను ఎంపిక చేసింది. ఇందులో మన దేశంలోని లేక్స్‌ సిటీ ఉదయ్‌పూర్‌, ఫైనాన్షియల్‌ క్యాపిటల్‌ ముంబై ఎంపికయ్యాయి.

పది అందమైన నగరాల కోసం సర్వే..
ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ వెకేషన్స్‌లో గడపడానికి టాప్ 10 బ్యూటీ డెస్టినేషన్‌ల జాబితా కోసం ఒక సర్వే నిర్వహించింది. సైట్లు, స్మారక చిహ్నాలు, సంస్కృతి, ఆహారం, లగ్జరీ, షాపింగ్ మరియు ప్రయాణ విలువ ఆధారంగా పర్యాటకులు రేటింగ్‌లు ఇచ్చారు. సర్వే తరువాత, రాజస్థాన్‌లోని ఉదయపూర్ 93.33 రీడర్ స్కోర్‌ను పొందింది, ఇది పర్యాటకులు ఇష్టపడే టాప్-10 నగరాల్లో నగరం రెండవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై పదో స్థానంలో నిలిచింది. పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శిఖా సక్సేనా మాట్లాడుతూ నగరంలో ఉన్న వారసత్వం, ఆతిథ్యం, వాతావరణం ఉదయపూర్‌కు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నగరంలో నైట్‌ అండ్‌ అడ్వెంచర్‌ టూరిజంను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

YES9 TV