కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుభేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
మంగళవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం అందజేశారు.
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంటు కింద ఏటా రూ. 450 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2014-15, 2019-20, 2021-2022-23 సంవత్సరాలకు సంబంధించి నిధులు ఇంత వరకూ విడుదల కాలేదని తెలిపారు. అంతేగాక, జీఎస్టీ వసూళ్లపై తెలంగాణకు పరిహారం కింద 2020-221, 2021-22, 2022-23 సంవత్సరాలకు సంబంధించి రూ. 698.97 కోట్లు రావాల్సి ఉందని కేంద్రమంత్రికి హరీశ్ రావు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. తాను చెప్పిన అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని హరీశ్ రావు తెలిపారు.
మరోవైపు, జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..రాష్ట్రానికి కింద రావాల్సిన బకాయిల
